ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా బారిన ఆర్టీసీ ఉద్యోగులు..టీకాలు ఇవ్వాలని వేడుకోలు ! - కరోనా టీకాలు తాజా వార్తలు

రోజూ ప్రజల మధ్యే ఉంటున్న ఆర్టీసీ సిబ్బంది...కరోనా మహమ్మారి ధాటికి వణికిపోతున్నారు. ఇప్పటికే చాలామంది వైరస్​ కాటుకు బలయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న తమకు కరోనా టీకా ఇవ్వాలంటున్న ఆర్టీసీ సిబ్బంది...ఇప్పటికీ పూర్తిస్థాయిలో మెుదటి డోసే అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా బారిన ఆర్టీసీ ఉద్యోగులు
కరోనా బారిన ఆర్టీసీ ఉద్యోగులు

By

Published : May 10, 2021, 3:49 AM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతితో...ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిత్యం ప్రజల్లో కలసి తిరగుతూ...విధులు నిర్వహించాల్సి ఉన్నందున...డ్రైవర్లు, కండక్టర్లు ఎక్కువ మంది కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. జాగ్రత్తలు తీసుకుంటున్నా బస్సుల్లో ప్రయాణికుల నిర్లక్ష్యంతో...సిబ్బంది మహమ్మారి కోరలకు చిక్కుకుంటున్నారు. కరోనా రెండోదశలో ఇప్పటి వరకు 748 మంది ఉద్యోగులు వైరస్ బారినపడ్డారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు 105 మంది కరోనాతో మృతి చెందారు. నిత్యం పదుల సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. కరోనా ఉద్ధృతితో ఆర్టీసీ ఉద్యోగులంతా.. బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం డిపోల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారని ఆ తర్వాత ఆ ఊసే లేదంటున్న ఉద్యోగులు...తమను ఎవరూ పట్టించుకోవటం లేదంటున్నారు. ఉద్యోగ బాధ్యతలు చూస్తూ వ్యాక్సినేషన్ కోసం బయట పీహెచ్ సీలు , వాక్సినేషన్ కేంద్రాల వద్ద గంటల తరబడి వరుసల్లో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం వదలి టీకాల కోసం వెళ్లినా కొరత కారణంగా తమ వరకు రావడం లేదంటున్నారు. వాక్సిన్ ఎప్పుడు వస్తుందో.. తమకు ఎప్పుడు వేస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ భయాందోళనలతో విధుల నిర్వహణ కష్టంగా ఉందంటున్న ఆర్టీసీ ఉద్యోగులు...తమను ప్రంట్​లైన్ వారియర్స్​గా గుర్తించి..వెంటనే కొవిడ్ టీకాలు అందించాలని కోరుతున్నారు.

కరోనా ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల్లో తమకు ప్రాణ రక్షణ కల్పించాలని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

కరోనా బారిన ఆర్టీసీ ఉద్యోగులు

ఇదీచదవండి

అనుమతి రాగానే.. అందరికీ వ్యాక్సినేషన్: అనిల్ సింఘాల్

ABOUT THE AUTHOR

...view details