RTC Employees Letter To MD Dwaraka Tirumala Rao ఏపీఎస్ ఆర్టీసీలో కొందరు అధికారుల తీరు బాగాలేదంటూ ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావుకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక లేఖ రాసింది. కొందరు అధికారులు, సూపర్ వైజర్ల తీరుతో ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు ఉందని లేఖలో పేర్కొంది. ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు నానాటికి పెరిగి పోతున్నాయన్నారు. కొందరు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయని ఆర్టీసీ ఎన్ఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ తదితర సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి డిపోలో అధికారులు ఇబ్బందు వల్ల సీహెచ్ చెంచయ్య అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వైఎస్సార్ జిల్లా పొద్దుటూరు డిపోలో నజీర్ అహమ్మద్ అనే ఉద్యోగిపై డిపో మేనేజర్ ఫోన్లో దుర్భాషలాడారన్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకొవాలని ఐక్యవేదిక నేతలు ఎండీని కోరారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరుగకుండా కూడా చూడాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.