RTC EMPLOYEES JAC LETTER TO MD : 9 నెలలైనా ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయకపోవడం వల్ల సిబ్బంది తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నేతలు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావుకు లేఖ రాశారు. ఎన్ఎంయూ, ఈయూ, ఎస్డబ్య్లూఎఫ్, కార్మిక పరిషత్ సహా పలు సంఘాలతో కూడిన ఐక్యవేదిక నేతలు లేఖ రాశారు. సెప్టెంబర్ నెలలో పెరిగిన వేతనాలు ఇస్తామని ఇటీవల సమావేశాల్లో స్వయంగా ఎండీ ప్రకటించారని.. కానీ నిరాశే మిగిలిందని లేఖలో తెలిపారు.
ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు ఆర్టీసీ జేఏసీ నేతల లేఖ.. ఎందుకంటే..! - ఎండీ ద్వారకా తిరుమలరావుకి ఆర్టీసీ జేఏసీ నేతల లేఖ
RTC EMPLOYEES LETTER TO MD : ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నేతలు లేఖ రాశారు. 9 నెలలైనా పీఆర్సీ అమలు చేయకపోవడం వల్ల సిబ్బంది తీవ్ర ఆందోళనలో ఉన్నారని లేఖలో తెలిపారు. ఇప్పటికైనా చొరవ తీసుకుని పీఆర్సీ అమలుపై ఉన్న అడ్డంకులు తొలగించాలని ఎండీని ఐక్యవేదిక నేతలు కోరారు. అక్టోబర్ 1 నుంచైనా ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరి 1 నుంచే పీఆర్సీ అమలు జరుగుతోందని, ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం 9 నెలలైనా పీఆర్సీ అమలులో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చొరవ తీసుకుని పీఆర్సీ అమలుపై ఉన్న అడ్డంకులు తొలగించాలని ఎండీని ఐక్యవేదిక నేతలు కోరారు. అక్టోబర్ 1 నుంచైనా ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఆర్టీసీ ఉద్యోగులకూ ఈ ఏడాది జనవరి 1 నుంచే పీఆర్సీ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: