కారుణ్య నియామకాలు చేపట్టాలంటూ.. విజయవాడలోని ఆర్టీసీ(rtc) కేంద్ర కార్యాలయం వద్ద ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కారుణ్య నియామకాల భర్తీ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2016 నుంచి 2019 వరకు నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయని.. ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు ఇంకా ఆలస్యం చేయవద్దన్నారు. ఆర్టీసీలో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనలతో కార్యాలయం నుంచి బయటికొచ్చిన ఆర్టీసీ ఉన్నతాధికారులు.. వినతులు ఉంటే అందించాలని కోరారు.
2020 నుంచి.. కోవిడ్ తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు మాత్రమే కారుణ్య నియామకాలు చేపట్టాలని.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలి ఇచ్చిందని.. అంతకు ముందు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న వాటికి ఉద్యోగాలు భర్తీ పై ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. ఈ మేరకు ఉద్యోగుల కుటుంబసభ్యులు.. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. బాధితుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరమలరావు హామీ ఇచ్చారు.