RTC Charges hike: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. డీజిల్ ధరల పెరగుదలతో ఛార్జీలు పెంచేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టగా.. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ధరల పెంపుదల ఆమోదం కోసం వారం క్రితమే దస్త్రాన్ని.. అధికారులు సీఎంకు పంపించగా.. నేడు ప్రకటన చేసే అవకాశం ఉంది.
RTC Charges hike: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం - ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు వార్తలు
12:26 April 13
ఆమోదం కోసం వారం క్రితమే దస్త్రాన్ని సీఎంకు పంపిన ఆర్టీసీ
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై ప్రకటన చేసే అవకాశముంది.
లోకేశ్ ఫైర్: వైకాపా ప్రభుత్వం పెంచిన పన్నులపై తెదేపా నేత లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ మాటలు వింటుంటే గాలి పీల్చినా... వదిలినా పన్ను వేసేలా ఉన్నారని తెదేపా నేత లోకేశ్ ఎద్దేవా చేశారు. 'కాదేది బాదుడే బాదుడుకు అనర్హం' అన్నట్టుగా వైకాపా ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. సామాన్యుడిపై పన్నుల పెంపు భారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మూడేళ్లలో రెండుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణమని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: