RTA on private travels buses: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులల్లో వాణిజ్యపరమైన సరుకులను రవాణా చేస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని డీటీసీఎం పురేంద్ర అన్నారు. అలా చేస్తే పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అని... ఆలాంటి బస్సులపై కేసు నమోదు చేయడంతో పాటు సీజ్ చేస్తామని హెచ్చరించారు. వాణిజ్యపరమైన సరుకును పార్సిల్ బాక్సులు, బండిల్స్, పెట్టెలు, మూటలు రూపంలో కట్టుకొని బస్సులపై భాగంలో, లోపల తీసుకెళ్తున్నారని అన్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పర్మిట్ నిబంధనల ప్రకారమే బస్సులు నడపాలని ఆయన సూచించారు. బస్సుల్లో ప్రయాణికుల లగేజీ తప్ప ఏ ఇతర సరుకులను ఎక్కించరాదన్నారు. బస్సులపై అధికలోడునుగానీ... ఎక్కువ మంది ప్రయాణికులనుగానీ ఎక్కించవద్దని చెప్పారు. పర్మిట్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తామన్నారు.