వరుసగా మూడు సభల్లో తాన ప్రసంగం ఇస్తున్నప్పుడే విద్యుత్ నిలిచిపోయిందని..తెలంగాణ కేడర్ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అలాగే తనతో మాట్లాడుతున్న వ్యక్తులపై తెలంగాణ ప్రభుత్వం నిఘా పెడుతుందని...దాని గురించి అందరికీ తెలుసని అన్నారు. . తమ శ్రమను దోపిడీ చేసి కట్టుకున్న రాజప్రసాదాలకు.. తెలంగాణ ప్రజలు పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తూ... ట్వీట్ చేశారు.
rs praveen kumar: 'త్వరలోనే ప్రజలు మీ పవర్ కట్ చేస్తారు' - తెలంగాణ 2021 వార్తలు
మూడు సభల్లో తన ప్రసంగమప్పుడే విద్యత్ పోవడంపై ఇటీవల స్వచ్చంద పదవీ విరమణ చేసిన తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. కావాలనే తన ప్రసంగం అప్పుడు విద్యుత్ తీసేస్తున్నారని ఆరోపించారు.
![rs praveen kumar: 'త్వరలోనే ప్రజలు మీ పవర్ కట్ చేస్తారు' rs praveen kuamr speaks about power cutting on his speech tim](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12670881-508-12670881-1628073933455.jpg)
ఇప్పటికి వరుసగా మూడు సభల్లో సరిగ్గా నా స్పీచ్ టైంలోనే పవర్ కట్ అయింది. నాతో మాట్లాడుతున్న వ్యక్తులపై నిఘా సంగతి ఇక చెప్పనక్కరలేదు. మా శ్రమను దోపిడీ చేసి కట్టుకున్న మీ రాజప్రసాదాలకు తెలంగాణ ప్రజలు పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి గుర్తుంచుకోండి. - ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
26 ఏళ్లు ఐపీఎస్ అధికారిగా సేవలు అందించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar) ఇటీవలె స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఇంకా ఆరు ఏళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ...ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.