Corruption in Inter Board : ఇంటర్మీడియట్ విద్యా మండలిలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. విద్యార్థులు చెల్లించే ఫీజులు, ప్రైవేటు కళాశాలలు చెల్లించే రుసుములకు జవాబుదారీగా ఉండాల్సిన వారే నిధులను పక్కదారి పట్టించారు. ప్రశ్నపత్రాల మూల్యాంకనం, పరీక్షల విధులు నిర్వర్తించిన సిబ్బందికి చెల్లించాల్సిన మొత్తాలతోపాటు మరికొన్ని అక్రమాలు జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.
ఇంటర్ బోర్డులో నిధులు మాయం.. కేసు సీఐడికి అప్పగించే యోచన - ఇంటర్మీడియట్ విద్యా మండలిలో అవినీతి
Corruption in Inter Board : ఇంటర్మీడియట్ విద్యా మండలిలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. విద్యార్థులు చెల్లించే ఫీజులు, ప్రైవేటు కళాశాలలు చెల్లించే రుసుములకు జవాబుదారీగా ఉండాల్సిన వారే నిధులను పక్కదారి పట్టించారు.
ప్రాథమిక దశలో 50లక్షల రూపాయల వరకు అవకతవకలు జరిగినట్లు భావించగా ప్రస్తుతం ఇది కోటి 50 లక్షలకు చేరింది. రికార్డుల పరిశీలన కొనసాగుతుండడంతో ఈ మొత్తం మరింత పెరగొచ్చని భావిస్తున్నారు. నిధులు మాయం చేసినట్లు బయట పడకుండా ఉండేందుకు ఏకంగా ఒరిజినల్ రికార్డులను మాయం చేసినట్లు తెలిసింది. అసలు బిల్లులు, రికార్డులు లేకపోవడంతో ప్రస్తుతం అంతర్గత పరిశీలన చేస్తున్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు అధికారుల్ని సస్పెండ్ చేయగా..మరో పొరుగు సేవల అధికారిణిపైనా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. ప్రస్తుతం వెలుగు చూసిన అక్రమాలపై కేసును సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదీ చదవండి :రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ