ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రేమోన్మాది బాధిత కుటుంబానికి సీఎం జగన్​ సాయం..రూ.10 లక్షలు అందజేత - vijayawada news

గత సంవత్సరం ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన యువతి కుటుంబానికి సీఎం జగన్ ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

cm help
cm help

By

Published : Nov 4, 2021, 2:17 AM IST

Updated : Nov 4, 2021, 7:05 AM IST

గత ఏడాది విజయవాడ హనుమాన్‌పేటలో ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన యువతి కుటుంబాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదుకున్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రిని యువతి తల్లిదండ్రులు కలిశారు. వారికి రూ. 10 లక్షల ఆర్థిక సాయంతో పాటు.. ఆమె సోదరుడికి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాన్ని సీఎం కల్పించారు. వారికి రూ. 10 లక్షల చెక్కును ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు అందజేశారు.

కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురానికి చెందిన వీరమల్ల పెద్ద జమలయ్య, ఏసమ్మల కుమార్తెను విజయవాడ హనుమాన్‌పేటలో గత ఏడాది అక్టోబర్‌లో అదే గ్రామానికి చెందిన నాగభూషణం పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుర్ఘటనలో ఆమె మృతి చెందింది. ఆ కుటుంబ పరిస్థితిని మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో.. సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు.

Last Updated : Nov 4, 2021, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details