ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రమే తీసుకోవాలి' - పోలవరం ప్రాజెక్టు తాజా వార్తలు

పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని సామాజిక విశ్లేషకులు లక్ష్మీనారాయణ వ్యాఖ్యనించారు. ప్రాజెక్టు నిర్మాణ అంశంపై ఆంధ్రప్రదేశ్ రైతు సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత అవసరమన్నది వక్తలు వివరించారు.

'పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రమే తీసుకోవాలి'
'పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రమే తీసుకోవాలి'

By

Published : Nov 18, 2020, 6:50 PM IST

ఆంధ్రప్రదేశ్ రైతు సేవా సంస్థ ఆధ్వర్యంలో అక్కినేని భవాని ప్రసాద్ అధ్యక్షతన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశంపై విజయవాడ ప్రెస్ క్లబ్​లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత అవసరమన్నదీ వక్తలు వివరించారు. గత ప్రభుత్వం సుమారు 11 వేల కోట్లు పోలవరం నిర్మాణం కోసం ఖర్చు చేస్తే.. వైకాపా ప్రభుత్వం 18 నెలలు గడిచినా కేవలం 6 వందల కోట్లే కేటాయించిందని ఏపీ రైతు సేవా సంస్థ అధ్యక్షులు భవాని ప్రసాద్ అన్నారు.

రివర్స్ టెండర్ పేరుతో ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపేసి కాంట్రాక్టు సంస్థలు మార్చారన్నారు. పోలవరం నిర్మాణానికి అన్ని పార్టీల వారు సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఏ ప్రాజెక్టు నిర్మించాలన్న మొదటి లబ్ధిదారుడుగా నిర్వాసితులు ఉంటారని...,నిర్వాసితుల పరిహారం సహా మొత్తం కేంద్రమే భరించాల్సి ఉంటుందని సామాజిక విశ్లేషకులు లక్ష్మీ నారాయణ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కేవలం నిర్మాణ ఏజెన్సీ మాత్రమేనని వ్యాఖ్యనించారు. చట్టాలను రూపొందించే పార్లమెంట్ వాటన్నింటిని అమలు పరచాలన్నారు. ప్రాజెక్టు ఎత్త్తుతగ్గిస్తే గతంలో సుప్రీం కోర్టు నియమించిన బచావత్ కమిటీ ఇచ్చిన నివేదికలో అంశాలకు తూట్లు పొడిచినట్లేనని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

శిథిలావస్థలో ప్రభుత్వ కళాశాలలు.. ఇబ్బందుల్లో విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details