ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నార్సీని అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలి

ఎన్నార్సీ, సీఏఏ, ఎన్​పీఆర్​లను వ్యతిరేకిస్తూ... వామపక్ష, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్​టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన 3 పార్టీలు ఎన్నార్సీకి మద్దతిచ్చాయని సీపీఐ రామకృష్ణ విమర్శించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

Round table meet held in vijayawada for oppose CAA in AP
ఎన్నార్సీని అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలి

By

Published : Feb 25, 2020, 4:44 PM IST

ఎన్నార్సీని అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలి

సీఏఏ, ఎన్నార్సీ, ఎన్​పీఆర్​లను వ్యతిరేకిస్తూ వామపక్ష, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్​టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్నార్సీ, సీఏఏ, ఎన్​పీఆర్​లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న అంశంపై చర్చించారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నార్సీని అమలు చేయబోమని తీర్మానం చేసిన విషయాన్ని సీపీఐ రామకృష్ణ గుర్తుచేశారు.

రాష్ట్రానికి చెందిన 3 పార్టీలు ఎన్నార్సీకి మద్దతిచ్చాయని రామకృష్ణ విమర్శించారు. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రంలోనూ ప్రతిపక్ష పార్టీలు ఎన్నార్సీని వ్యతిరేకించాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లులకు మద్దతు తెలిపాయని సమావేశంలో పాల్గొన్న నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా లేని భాజపా చాలా బలంగా ఉందని ఎద్దేవా చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details