ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రాన్ని ఒత్తిడి చేయాలి' - పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రౌండ్ టేబుల్ సమావేశం న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై తలెత్తుతున్న అపోహలు, ఆందోళనలను దూరం చేసేందుకు ఒక ప్రతినిధి బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ విషయంపై సమగ్రంగా చర్చించేందుకు తక్షణమే అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరాయి.

'పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రాన్ని ఒత్తిడి చేయాలి'
'పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రాన్ని ఒత్తిడి చేయాలి'

By

Published : Nov 30, 2020, 7:58 PM IST

పోలవరం ప్రాజెక్టు విషయమై కేంద్రం వద్దకు ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లాలని.. రాష్ట్రప్రభుత్వాన్ని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. విజయవాడ దాసరిభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షతన పోలవరం నిర్మాణ స్థితిగతులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, కాంగ్రెస్ నేత తులసి రెడ్డి పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం ఆలస్యం లేకుండా త్వరిగతిన పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలవరం పనులు ముందుకు వెళ్ళడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details