ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భూ యజమాని ప్రమేయంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు- స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సొంత భూమి లేని ప్రతి కౌలు రైతుకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి. ప్రసాద్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే గ్రామ సభలు నిర్వహించి నేరుగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. షరతులు లేకుండా కౌలు రైతులు అందరికీ రైతు భరోసా చెల్లించాలన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం సాగు చేస్తున్న భూమి నిష్పత్తిని బట్టి పంట రుణాలు ఇవ్వాలన్నారు. దేవాలయ, వక్ఫ్ భూములు, పూజారి మాన్యాలను సాగు చేస్తున్న కౌలు రైతులు అందరికీ సీసీఆర్సీ కార్డులు రైతు భరోసా పథకం ద్వారా ఇవ్వాలన్నారు.
'ప్రతి కౌలు రైతుకు.. రైతు భరోసా కింద పెట్టుబడి సాయమివ్వాలి' - round table conference of ap tenant farmers in vijyawada
విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘాలు రౌండు టేబుల్ సమావేశం నిర్వహించారు. సొంత భూములు లేని ప్రతి కౌలు రైతుకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని ఏపీ రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి. ప్రసాద్ డిమాండ్ చేశారు.
!['ప్రతి కౌలు రైతుకు.. రైతు భరోసా కింద పెట్టుబడి సాయమివ్వాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5002067-1015-5002067-1573221334044.jpg)
విజయవాడలో ఏపీ కౌలు రైతుల సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం