విజ్ఞానం(knowledge) సంపాదించడం అంటే పుస్తకాల్లో ఉన్న విషయాల్ని బట్టీ పట్టడం కాదు. అందులోని అంశాలు, పరిజ్ఞానం వినియోగించుకుని సమాజానికి కావాల్సిన ఆవిష్కరణలు చేయడం. మన చదువుతో నలుగురికి అండగా నిలవడం అంటున్నారు విజయవాడకు(vijayawada) చెందిన ఈ కుర్రాళ్లు.. అనడమే కాదు, తమ మేధస్సుతో వృద్ధుల కోసం సరికొత్త ఆవిష్కరణ(invent) చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. విజయవాడ పీవీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ.. ఏటా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. అందులో భాగంగా ఓ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడి వృద్ధులు ఆహారం, నీళ్లు వంటి అవసరాలకు అటూఇటూ తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు. అది చూసిన అధ్యాపకులు.. వారి సమస్యకు పరిష్కారం చూపగలరా అని విద్యార్థులకు సవాల్ విసిరారు. దాన్ని స్వీకరించిన క్రాంతి కుమార్, సాయి మోహన్, కోటేశ్వర రావు అనే ఈ యువకులు... ప్రత్యేక రోబో(robot) తయారు చేసి పరిష్కారం చూపారు.
ముందుగానే ప్రోగ్రామింగ్...
మొదటగా ప్రోటో టైప్(proto type)లో తమ ఆలోచన పంచుకోగా అది కళాశాల యాజమాన్యానికి నచ్చింది. ఆ ప్రాజెక్టు(project) ఖర్చులు మొత్తం తామే భరిస్తామంటూ ముందుకు వచ్చింది. దాంతో రంగంలోకి దిగిన ఈ యువ బృందం... వివిధ ఆంశాలను పరిగణలోకి తీసుకుని ఈ రోబోను తయారు చేశారు. దాదాపు 4 నెలల పాటు శ్రమించి దీనికి రూపకల్పన చేశారు. వృద్ధులు ఎక్కువదూరం నడవకుండా.. వాళ్లకు కావాల్సిన ఆహారం, మంచినీళ్లు వాళ్ల వద్దకే చేర్చాలి. అందుకు ఎంబెడెడ్ సిస్టమ్ సాంకేతికత(embed system technology) వినియోగించారు. ఈ సెన్సార్లు(sensor) నలుపు రంగును గుర్తిస్తాయి. ఆ థియరీ ఆధారంగా ఆశ్రమంలో ఉన్న మంచాల వరుసల మధ్య నలుపు రంగు టేపు అంటించి సెన్సార్లు ఉన్న రోబోను అటువైపు ప్రయాణించేలా చేస్తున్నారు.
వృద్ధులకు అండగా...