విజయవాడ సత్యనారాయణపురంలో దారిదోపిడీ(ROBBERY) సంఘటన చోటు చేసుకుంది. సత్యనారాయణపురం ఓగిరాలవారి వీధిలో రాత్రి సమయంలో పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న వ్యాపారి శనగపల్లి కోటేశ్వరరావుపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. వ్యాపారిని బెదిరించి.. అతని వద్దఉన్న బ్యాగ్ లాక్కొని పారిపోయారు. ఈ ఘటనలో సుమారు రూ. 6 లక్షల సొమ్ము చోరీకి గురైనట్లు బాధితుడు కోటేశ్వరరావు తెలిపారు. దీనిపై బాధితుడు సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు.
ROBBERY: దారిదోపిడీ దొంగల కలకలం.. వ్యాపారి నుంచి రూ.6 లక్షలు చోరీ - చోరీ వార్తలు

ROBBERY
22:39 September 23
Last Updated : Sep 23, 2021, 11:49 PM IST