విజయవాడ నగర శివారులోని రాజీవ్ నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల ప్రధాన రహదారి వెంబడి అక్రమంగా ఏర్పాటు చేసిన చిరు దుకాణాలు, బడ్డీ కొట్లను వీఎమ్సీ అధికారులు తొలగించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ మురళీ పర్యవేక్షణలో నిర్వహించారు. మరోసారి ఇలా రహదారుల వెంబడి ప్రభుత్వ స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేస్తే కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
విజయవాడ శివారులో చిరు దుకాణాల తొలగింపు - వీఎమ్సీ అధికారులు తాజా వార్తలు
విజయవాడ నగర శివారులో ఏర్పాటు చేసిన బడ్డీకొట్లు, చిరు దుకాణాలను వీఎమ్సీ అధికారులు శనివారం తొలగించారు. ఇటువంటి చర్యలకు మరోసారి పాల్పడితే కేసులు తప్పవని అధికారులు హెచ్చరించారు.
![విజయవాడ శివారులో చిరు దుకాణాల తొలగింపు road side small shops were removed by vmc officers in vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8605041-1074-8605041-1598704856436.jpg)
నగర శివారులోని రోడ్లపై ఉన్న చిరుదుకాణాలు, బడ్డీ కొట్లు తొలగింపు