ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రమాదం.. బస్సు డ్రైవర్ మృతి - Chennai-Kolkata National Highway news

చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. గన్నవరం నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొంది. బస్సు డ్రైవర్‌కు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. బస్సులోని 53 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.

చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

By

Published : Jun 8, 2021, 10:57 PM IST

Updated : Jun 9, 2021, 1:32 PM IST

చెన్నై - కోల్​కతా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. గన్నవరం నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్​ని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ను అంబులెన్స్ లో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ మరణించాడని... బస్సులోని 53 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని గన్నవరం పొలీసులు తెలిపారు. మృతుడిని తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా బాలాసోర్ వాసి విఠల్ వేలు (27) గుర్తించారు.

గత రాత్రి ఒడిశా నుంచి తిరువనంతపురం వెళ్లే ట్రావెల్స్ బస్ కీసరపల్లి వద్ద ఒక్కసారిగా టైర్ పేలడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. తొలుత ఎదుటి వాహనాన్ని ఢీ కొట్టి.. తర్వాత డివైడర్ ఎక్కిందని వివరించారు. డ్రైవర్ మృతి మినహా బస్సులోని అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా.. ప్రయాణికులను గమ్యస్థానాలకు సీఐ శివాజీ బృందం తరలించిందని.. తెలిపారు.

Last Updated : Jun 9, 2021, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details