ACCIDENT: విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కాల్వలో పడ్డ కారు.. విద్యార్థి మృతి - ఏడుగురికి గాయాలు - Siddhartha Engineering College students died in road accident
07:02 September 12
accident in bapatla
గుంటూరు జిల్లా బాపట్లలో కారు కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. విజయవాడకు చెందిన సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు కారులో.. అర్ధరాత్రి ఒంటిగంట సమీపంలో సూర్యలంక సముద్ర స్నానానికి వచ్చారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో బాపట్ల ఆదర్శనగర్ వద్దకు చేరుకోగానే.. వేగంగా ప్రయాణిస్తున్న కారు కరెంటు స్తంభాన్ని ఢీకొంది.
ప్రమాదంలో కారు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్ళింది. సమయానికి అక్కడే ఉన్న మత్స్యకారులు కారు అద్దాలు పగలగొట్టి వారందర్నీ రక్షించారు. ఘటనలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన మరో ఏడుగురిని స్థానిక వైద్యశాలకు తరలించారు. నిహారిక , సాయి తులసి అనే ఇద్దరు విద్యార్థుల తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో మత్స్యకారులు స్పందించకుంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు.
ఇదీ చదవండీ..VIJAYAWADA KANAKA DURGA TEMPLE: దుర్గమ్మ సన్నిధిలో.. భక్తుల బసకు చోటేది?