ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు వద్ద బస్సు బోల్తా.. పలువురు మృతి - ap latest news
10:08 March 19
క్షతగాత్రులకు తుముకూరులోని ఆస్పత్రిలో చికిత్స
Road accident: ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని వై.ఎన్.హొసకోట నుంచి పావగడకు వెళ్తున్న ప్రైవేటు బస్సు బోల్తాపడటంతో ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురు మరణించారు. సుమారు 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను తుముకూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు బోల్తా పడే సమయంలో.. పలువురు బస్సు పైనుంచి కిందకు దూకారు. మృతుల్లో ఎక్కువమంది బస్సు పైనుంచి దూకినవారే ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో.. బస్సులో 40 మంది ప్రయాణికులు.. బస్సు టాప్ పైనా కూడా పలువురు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:
VOA Nagalakshmi suicide : ఆమె ఆత్మహత్య చేసుకుంటే గానీ.. నిందితుడి అరెస్టు లేదు!