కోర్టు కేసులపై 'మనుపాత్ర' పేరుతో ప్రత్యేక యాప్: రజత్ భార్గవ - cs rajath bjargava review meeting news
![కోర్టు కేసులపై 'మనుపాత్ర' పేరుతో ప్రత్యేక యాప్: రజత్ భార్గవ rajath bjargava](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13054344-120-13054344-1631546222334.jpg)
20:00 September 13
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీక్ష
న్యాయస్థానాల్లో ప్రభుత్వ కేసుల వేగవంతం కోసం 'మనుపాత్ర' పేరుతో ప్రత్యేక యాప్ తీసుకువస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. కోర్టు కేసుల విషయంలో అధికారులు ఎటువంటి అలసత్వం వహించరాదని సూచించారు. కోర్టు కేసులపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని.. సమయానుసారంగా కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. న్యాయస్ధానాలకు అవసరమైన సమాచారం అందించాలని ఆదేశించారు.
కోర్టు కేసుల పురోగతిపై సమీక్ష చేసిన రజత్ భార్గవ.. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కేసుల సంఖ్యను అనుసరించి ప్రత్యేకంగా లీగల్ సెల్ ను ఏర్పాటు చేసుకోవాలని, క్రింది స్దాయిలో జరిగే తప్పుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాలన్నారు. వివిధ విభాగాలకు సంబంధించి ప్రభుత్వ న్యాయవాదులతో ప్రతి కార్యాలయం నుంచి ఒకరిని లైజనింగ్ కోసం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ శాఖలు - ప్రభుత్వ న్యాయవాదుల మధ్య సమన్వయం ఉండాలన్నారు. రిజస్ట్రేషన్ల శాఖకు 2000 కేసులు, పర్యాటక రంగం శాఖకు 50 కేసులు, క్రీడా శాఖకు 52 కేసులు, వాణిజ్య పన్నుల శాఖకు 114 కేసులు ఉన్నట్లు అధికారులు వివరించారు.
ఇదీ చదవండి