ఆంధ్రా బ్యాంక్ విలీన అంశాన్ని కేంద్రం పునరాలోచించాలని తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. తెలుగువారు ఆంధ్రాబ్యాంక్‌ను తమ బ్యాంక్‌గా భావిస్తారని గుర్తు చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలుగువారిని బాధపెట్టేదిగా ఉందన్నారు. గతంలో ప్రైవేటు బ్యాంకులను జాతీయ బ్యాంకుల్లో విలీనం చేశారన్నారు. ఇప్పుడు జాతీయ బ్యాంకులను విలీనం చేయటాన్ని ప్రజలు స్వాగతించడం లేదని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఆంధ్రాబ్యాంక్ విలీనంపై పునరాలోచించండి: సోమిరెడ్డి - Andhra Bank
ఆంధ్రాబ్యాంక్ విలీనంపై కేంద్రం మరోసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని మాజీమంత్రి సోమిరెడ్డి కోరారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందికాదని..తెలుగువారిని బాధపెట్టేదిగా ఉందని వాపోయారు.
సోమిరెడ్డి