ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: మహిళకు అరబ్​ షేక్​ నుంచి విముక్తి - women reached to kamareddy from arab country latest news

ఈటీవీ- ఈటీవీ భారత్​లో ప్రసారమైన కథనాలకు లభించిన స్పందనతో ఒక మహిళ.. స్వదేశం చేరుకుంది. అరబ్​ షేక్​ల చేతిలో బంధిగా మారిన బాధితురాలికి విముక్తి లభించింది. తన కష్టాన్ని ప్రసారం చేసి... విముక్తికి కారణమైన ఈటీవీ- ఈటీవీ భారత్​కు బాధితురాలు కృతజ్ఞతలు తెలిపింది.

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: మహిళకు అరబ్​ షేక్​ నుంచి విముక్తి
ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: మహిళకు అరబ్​ షేక్​ నుంచి విముక్తి

By

Published : Oct 18, 2020, 9:52 PM IST

ఈటీవీ- ఈటీవీ భారత్​లో "విధి అనసూయ" అనే శీర్షికన ప్రసారమైన కథనానికి స్పందిన లభించింది. ఎడారి దేశంలో బతుకు దారిని వెతుక్కుంటూ వెళ్లి... అరబ్​షేక్​ చేతికి చిక్కిన ఓ మహిళకు విముక్తి లభించింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మరావుపేట్ గ్రామానికి చెందిన సుంకరి అనసూయ పొట్టకూటి కోసం ఒమన్​కు వెళ్లి అక్కడే ఇరుక్కుపోయింది. ఆమె ఇబ్బందిని వార్తా కథనం ద్వారా తెసుకున్నజగిత్యాల జిల్లా వాసి అయిన రాష్ట్ర ఒమన్ ఎన్​ఆర్​ఐ గ్రూప్ అధ్యక్షుడు నరేందర్ పన్నీర్... బాధితురాలు పని చేస్తున్న షేక్​తో మాట్లాడి... కావాల్సిన డబ్బులు ఇచ్చి ఇండియాకు పంపారు.

ఈటీవీ- ఈటీవీ భారత్​కు బాధితురాలు కృతజ్ఞతలు తెలిపింది. తన పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపెట్టటం వల్లే... తమను ఆదుకుంటున్నారని, తనను కష్టాల చెరసాల నుండి విముక్తురాలిని చేశారని తెలిపింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.

తన అక్క ఆరోగ్యం బాగోలేదని... ఎవరైనా దాతలు ఉంటే ఆదుకోవాలని వేడుకుంది. తన ఇల్లు పూరి గుడిసె కావడం వల్ల వర్షానికి ఇంట్లోకి నీళ్లు వస్తాయని... రాత్రులు పడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉందని రాత్రులు ఇంటి సౌకర్యం సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నామని గోడు వెళ్లబోసుకుంది. సీఎం కేసీఆర్ దయతలచి తమకు ఇంటిని అందించి... ఏదైనా పని కల్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటానని వేడుకుంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details