పశ్చిమబంగా నుంచి విజయవాడ నగరానికి వచ్చిన వలస కూలీలు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి అవస్థలు పడ్డారు. వారి ఇబ్బందులపై ఈటీవీ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. గుంటూరుకి చెందిన అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్... వలస కూలీలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈటీవీ కథనం చూసి స్పందించిన అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు లక్ష్మీనారాయణ... సంస్థ ప్రతినిధుల ద్వారా 85 కుటుంబాలకు మే 3 వరకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేశారు. బియ్యం, గోధుమ పిండి, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, నూనె అందించారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి కోల్పోయామని, తమ యజమాని పట్టించుకోకపోయినా దాతలు ఇచ్చే వాటితో కడుపునింపుకుంటున్నామని వలస కూలీలు చెబుతున్నారు. ఈటీవీకి, అమ్మ ఛారిటబుల్ ట్రస్టుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
వలస కూలీల ఆకలి తీర్చిన ఈటీవీ కథనం - విజయవాడలో వలస కూలీల ఇబ్బందులు
ఉపాధి కోసం పశ్చిమబంగా నుంచి రాష్ట్రానికి వచ్చారు. లాక్డౌన్ కారణంగా పనులు దొరక్క అవస్థలు పడ్డారు. తినడానికి తిండిలేక పస్తులు ఉన్నారు. వారి సమస్యలపై ఈటీవీ కథనం ప్రసారం చేసింది. స్పందించిన దాతలు వారికి సాయం అందించారు.
వలస కూలీల ఆకలి తీర్చిన ఈటీవీ కథనం
ఇదీ చదవండి