అంతరాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శాసన సభ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. సామాజిక న్యాయం పాటించాల్సిన అవసరం ఉందని శాసనసభాపతి పేర్కొన్నారు. ఈ దిశగా ప్రధాని నరేంద్రమోదీ, సీఎం జగన్ విశేష కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాజ్యాంగ వ్యవస్థలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు.
మండలిలో...
శాసనమండలి ప్రాంగణంలో మండలి ఛైర్మన్ షరీఫ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏ దేశానికీ లేనంత బలం భారతదేశానికి యువత రూపంలో ఉందని చెప్పారు. దేశ పునర్మిణానికి యువత అంకితమవ్వాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధులు అందించిన స్వేచ్ఛా ఫలాలు అనుభవిస్తూ.. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు.
అసెంబ్లీ ప్రాంగణంలో ఘనంగా గణతంత్ర వేడుకలు ఇదీ చదవండి:
విజయవాడలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన గవర్నర్