విజయవాడలోని 61వ డివిజన్లోని పాయకాపురం చెరువు వెంబడి ఆక్రమణలు తొలగించడానికి నగరపాలక సంస్థ, రెవెన్యూ అధికారులు పూనుకున్నారు. ఈ చెరువులో సుమారు నాలుగు ఎకరాల మేర ప్రాంతం ఆక్రమణకు గురైందని... రెవెన్యూ అధికారులు నిర్దరించినట్లు తెలిసింది. శుక్రవారం కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టి 22 ఇళ్లు తొలగించారు. బాధితులకు పునరావాసం కింది జెఎన్యూఆర్ఎం గృహాలు కేటాయించారు. తొలగింపు పనులను నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్, నార్త్ మండల తహసీల్దార్ దుర్గాప్రసాద్ పర్యవేక్షించారు. పేదలకు అన్యాయం చేయకుండా ఇళ్లు కేటాయించాలని సీపీఎం, తెదేపా నాయకులు అధికారులను కోరారు.
ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టిన అధికారులు - vijayawada latest news
విజయవాడలోని పాయకాపురం చెరువు వెంబడి ఆక్రమణలను తొలగించడానికి నగరపాలక సంస్థ, రెవెన్యూ అధికారులు శ్రీకారం చుట్టారు. చెరువులో సుమారు నాలుగు ఎకరాల మేర ప్రాంతం ఆక్రమణకు గురైందని రెవెన్యూ అధికారులు నిర్ధరించినట్లు తెలిసింది.
ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన అధికారులు