ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెమిడెసివర్​ అక్రమంగా విక్రయిస్తున్న ముఠా అరెస్ట్​ - కరోనా వార్తలు

కరోనా రోగులకు వినియోగించే రెమిడెసివర్​ను అక్రమంగా బ్లాక్​ మార్కెట్​లో విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

సీపీ బ‌త్తిన శ్రీ‌నివాసులు, మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు
రెమిడెసివిర్​ అక్రమంగా విక్రయిస్తున్న ముఠా అరెస్ట్​

By

Published : Apr 27, 2021, 9:04 PM IST

కరోనా చికిత్సలో కీలకమైన రెమిడెసివర్ ఇంజక్షన్ల అక్రమ విక్రయం జోరుగా సాగుతోంది. 2500 ఖరీదు చేసే ఇంజక్షన్​ను రూ. 35 వేలకు విక్రయిస్తున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో దీనిపై నిఘా పెట్టిన పటమట పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఫార్మా కంపెనీలకు చెందిన రిప్రజెంటివ్​లు, మందుల దుకాణదారులు కలిసి ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపామని పోలీసులు తెలిపారు. కరోనా వ్యాధి తీవ్రత త‌గ్గించేందుకు వినియోగిస్తున్న రెమిడెసివర్‌ ఇంజక్షన్లను అక్రమంగా అధిక ధ‌ర‌ల‌కు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల‌ని విజయవాడ సీపీ బ‌త్తిన శ్రీ‌నివాసులును.. మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ఆదేశించారు. న‌గ‌ర పరిధిలో ఆక్సిజన్‌, రెమిడెసివర్‌ ఇంజక్షన్లను బ్లాక్‌ మార్కెట్లకు తరలిస్తున్న వారిని ఉపేక్షించవద్దని మంత్రి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details