ఆషాడ మాసంలో బెజవాడ కనకదుర్గమ్మకి సారె సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పసుపు, కుంకుమ, సారె, గాజులు, చలిమిడి అమ్మవారికి సమర్పిస్తున్నారు. అమ్మవారి కటాక్షంతో సుఖ శాంతులు పొందాలని భక్తులు ఆకాంక్షించారు. పవిత్ర సారె కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. గతేడాది యాభై వేలమంది భక్తులు పవిత్రసారె తీసుకువచ్చారని... ఈసారి భక్తుల సంఖ్య అధికంగా ఉండవచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల మూడో తేదీన మొదలైన ఆషాడ సారె కార్యక్రమం ఆగస్ట్ ఒకటో తేదీ వరకు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.
వైభవంగా దుర్గమ్మ 'పవిత్ర సారె' వేడుక - religion
బెజవాడ కనకదుర్గమ్మకి సారె సమర్పించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆషాడ మాసంలో ప్రారంభమైన పవిత్ర సారె కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
ఆషాడంలో దుర్గమ్మకు పవిత్ర సారె సమర్పిస్తున్న భక్తులు