Employees: తెలంగాణ వెళ్లాలనుకునే ఉద్యోగుల రిలీవ్‌కు ప్రభుత్వం కసరత్తు - ఏపీ నుంచి తెలంగాణ వెళ్లాలనుకునే ఉద్యోగుల రిలీవ్‌కు కసరత్తు
21:22 October 05
ఉద్యోగుల రిలీవ్‌కు కసరత్తు
ఏపీ నుంచి తెలంగాణ వెళ్లాలనుకునే ఉద్యోగుల రిలీవ్‌కు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. స్థానికత, భాగస్వామి దృష్ట్యా తెలంగాణకు పంపాలని ఉద్యోగుల గత కొంత కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉద్యోగుల విజ్ఞప్తిని సంఘం ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా..రిలీవ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మెుదలు పెట్టింది. తెలంగాణ వెళ్లాలనుకునే వారి నుంచి ఆప్షన్ ఫార్మ్స్ తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఉద్యోగుల రిలీవ్‌పై రెండ్రోజుల్లో మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి
Aadhar Mistake: అధికారుల నిర్వాకం.. తలకిందులైన యువకుడి జీవితం