ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్‌ అక్రమాస్తుల కేసులో బీపీ ఆచార్యకు చుక్కెదురు - జగన్‌ అక్రమాస్తుల కేసులో బీపీ ఆచార్యకు చుక్కెదురు వార్తలు

జగన్‌ అక్రమాస్తుల కేసులో మాజీ ఐఏఎస్‌ అధికారి బి.పి.ఆచార్యకు చుక్కెదురైంది. అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలను విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుంటూ మార్చి 10న సీబీఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆయన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

జగన్‌ అక్రమాస్తుల కేసులో బీపీ ఆచార్యకు చుక్కెదురు
జగన్‌ అక్రమాస్తుల కేసులో బీపీ ఆచార్యకు చుక్కెదురు

By

Published : May 21, 2021, 7:12 AM IST

Updated : May 21, 2021, 8:49 AM IST

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడైన మాజీ ఐఏఎస్‌ అధికారి బి.పి.ఆచార్యకు చుక్కెదురైంది. అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలను విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుంటూ మార్చి 10న సీబీఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆయన అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఆచార్యపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(2) రెడ్‌ విత్‌ 13(1)(డి) కింద విచారణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి నిరాకరించగా.. కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. విచారణకు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కేంద్రానికి ఆచార్య విజ్ఞప్తి చేశారు. కేంద్రం నిర్ణయం తీసుకునేదాకా విచారణ నిలిపివేయాలంటూ గతంలో హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. దాని గడువు ముగియడంతో మార్చి 10న అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలను విచారణ నిమిత్తం (కాగ్నిజెన్స్‌) పరిగణనలోకి తీసుకుంటూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

తన విజ్ఞప్తిపై కేంద్రం నిర్ణయం తీసుకునేదాకా విచారణ నిలిపివేయాలని, సీబీఐ కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని బి.పి.ఆచార్య మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించారు. దీనిపై ఒకేసారి తుది విచారణ చేపడతామని తెలిపారు. ఆచార్య పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను జూన్‌ 17వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏపీఐఐసీ వైస్‌ఛైర్మన్‌, ఎండీగా ఉన్న ఆచార్య నిబంధనలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా 8,841 ఎకరాల కేటాయింపులో కీలక పాత్ర పోషించారని, భూమిని తాకట్టుపెట్టి రుణాలు తీసుకోవడానికి లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు అనుమతులిచ్చారని సీబీఐ అభియోగాలు మోపింది.

బీ.ఎస్ గాంధీకి బెయిల్ నిరాకరణ

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో...ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస్‌ గాంధీకి హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఈడీ దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన బీ.ఎస్ గాంధీని ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారనే అభియోగంపై..సీబీఐ ఇటీవలే అరెస్ట్ చేసింది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న గాంధీ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది.

ఇదీచదవండి

రాష్ట్ర బడ్జెట్‌ రూ.2,29,779 కోట్లు.. సంక్షేమ పథకాలకు పెద్దపీట

Last Updated : May 21, 2021, 8:49 AM IST

For All Latest Updates

TAGGED:

jagan case

ABOUT THE AUTHOR

...view details