రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ బస్ డిపోలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలకు కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు బ్యానర్లు, టీవీల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దేశ నలుమూలల నుంచి వేల మంది ప్రయాణికులు విజయవాడకు వస్తుంటారు. దీనివల్ల యాంటీ బ్యాక్టీరియా స్ప్రేను బస్ డిపోతో పాటు పరిసరాల్లోనూ చల్లుతున్నారు.
టికెట్ తీసుకునేటప్పుడు ప్రయాణికులకు శానిటైజర్‌ను అందిస్తున్నారు. ఆర్టీసి పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం వల్ల విద్యార్ధులంతా గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఒకేసారి బస్టాండ్‌కు చేరుకున్నారు. బస్సుల్లో వెంటిలేషన్ వచ్చేందుకు.. కర్టెన్‌లు తొలగించారు. సీట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం సహా స్ప్రే చల్లుతున్నారు. మరోవైపు కరోనా ప్రభావంతో ఆర్టీసీకి 20 శాతం ఆదాయం తగ్గిందని అధికారులు చెబుతున్నారు.