తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపల సింగారంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా... స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఓ వైపు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే... మరో వైపు గుంటూరు జిల్లా నుంచి రికార్డింగ్ డ్యాన్సర్లను తీసుకొచ్చి ప్రభను ఏర్పాటు చేశారు. ఈ తంతు చూస్తూ అధికారులు అడ్డుకోలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రహ్మోత్సవాల్లో రికార్డింగ్ డ్యాన్స్.. పలువురి ఆగ్రహం - recording dance in venkateshwara swamy celebrations
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా వేపల సింగారంలో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలతో పాటు రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రహ్మోత్సవాల్లో రికార్డింగ్ డ్యాన్స్