రాష్ట్రానికి చెందిన పద్యనాటక కళాకారుడు యడ్ల గోపాలరావుకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. పద్యనాటక కళాకారుడిగా ప్రఖ్యాతిగాంచిన యడ్ల గోపాలరావు 50 ఏళ్ల కాలంలో 5వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇచ్చిన ప్రదర్శనలతో ఎంతో ఖ్యాతి పొందిన గోపాలరావుకు 2020వ సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది.
రాష్ట్రం నుంచి పద్మ పురస్కారాలు అందుకున్న వారు వీరే.. - పద్మశ్రీ
దిల్లీలోని రాష్ట్రపతి భవనల్లో పద్మా అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 2020లో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ పురస్కారాలు అందజేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర హెంమంత్రి అమిత్ షా సహా ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
పద్మ పురస్కారాలు
ఆర్ట్‌లో రామస్వామి అన్నవరపు, సాహిత్యంలో ప్రకాశ్ రావుకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది. బాడ్మిండన్ క్రీడాకారిణిికి పీవీ సింధుకు పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి అందించారు. ఆర్ట్‌లో నిడమూరు సుమతికి పద్మశ్రీ పురస్కారం వచ్చింది.
ఇదీ చదవండి:పద్మ అవార్డుల ప్రదానోత్సవం-మోదీ సహా ప్రముఖులు హాజరు