రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గిస్తే రియల్ ఎస్టేట్ రంగం కొంతమేర కుదుటపడే అవకాశముంటుందని క్రెడాయ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవీ రమణరావు అన్నారు. ఈనెల 9,10 తేదీల్లో విజయవాడలో క్రెడాయ్ ఆధ్వర్యంలో ప్రాపర్టీషోను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంత పుంజుకుంటుందని.. విజయవాడలో తక్కువగానే ఉందన్నారు. నూతన నిర్మాణ ప్రాజెక్టులు తక్కువగా ఉన్నాయన్నారు. నిర్మాణ రంగానికి కావాల్సినంత ఇసుక సప్లయ్ కావట్లేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉందన్నారు. కొవిడ్ కారణంగా నిర్మాణ రంగం దెబ్బతిందని తెలిపారు.