ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యూఎన్ అవార్డులకు ఎంపికైన ఆర్బీకేలు: మంత్రి కాకాణి - యూఎన్ అవార్డులకు ఎంపికైన ఆర్బీకేలు వార్తలు

రైతు భరోసా కేంద్రాలు ఐక్యరాజ్య సమితి ఫుడ్ ఆర్గనైజేషన్ అవార్డులకు ఎంపికయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఆర్బీకేలు అవార్డులకు ఎంపిక కావటం గౌరవంగా ఉందన్న ఆయన.. సీఎం జగన్ ఆలోచనల ప్రతిరూపకంగానే ఆర్బీకేలు ఏర్పాటయ్యాయన్నారు.

యూఎన్ అవార్డులకు ఎంపికైన ఆర్బీకేలు
యూఎన్ అవార్డులకు ఎంపికైన ఆర్బీకేలు

By

Published : May 4, 2022, 5:00 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు భరోసా కేంద్రాలు ఐక్యరాజ్య సమితి ఫుడ్ ఆర్గనైజేషన్ అవార్డులకు ఎంపికయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. యూఎన్ అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్బీకేలను నామినేట్ చేసిందని తెలిపారు. సీఎం జగన్ ఆలోచనల ప్రతిరూపకంగానే ఆర్బీకేలు ఏర్పాటు అయ్యాయన్నారు. రైతు భరోసా కేంద్రాలు యూఎన్ ఛాంపియన్ అవార్డ్​కు ఎంపిక కావటం గౌరవంగా ఉందన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్షాలకు లేదని కాకణి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం అందలేదని ఆయన ఆరోపించారు. పంటల బీమా కింద చంద్రబాబు పెట్టిన రూ.119 కోట్ల బకాయిలను సీఎం జగన్ చెల్లించారన్నారు.

రాష్ట్రంలో అత్యాచారాలు జరిగితే తెదేపా నేతలు సంబరం చేసుకుంటున్నారని మంత్రి కాకాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెదేపా ప్రణాళిక ప్రకారమే కొందరు వ్యక్తులను రెచ్చగొట్టి శాంతిభద్రతల లోపంగా ఎత్తిచూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెదేపాకు చెందినవారే అత్యాచారాలు, హత్యలు చేసి వారే రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. గడచిన మూడేళ్లలో 694 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారందరికీ ప్రభుత్వం తరపున ఆర్ధిక సాయం అందిందన్నారు.

సచివాలయంలో మంత్రి కాకాణి మాట్లాడుతున్న సమయంలో కరెంటు కోతల కారణంగా విద్యుత్ నిలిచిపోయింది. దీంతో మీడియా సమావేశాన్ని కొద్దిసేపు నిలిపివేశారు.

ఇదీ చదవండి: పరిశ్రమలకు పవర్ హాలిడే కొనసాగింపు -సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details