కృష్ణా జిల్లా విజయవాడ కొత్తపేట వించిపేటలో ఇమ్రాన్ అనే పాత నేరస్తుడు దారుణ హత్యకు గురైయ్యాడు. సమాచరం అందుకున్న కొత్తపేట పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో స్ధానికంగా నివాసముండే జాఫర్ అనే వ్యక్తి ఇమ్రాన్‌తో గొడవ పడినట్లు పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించారు. మృతుడిపై గతంలో దోపిడీ కేసులు ఉన్నాయని, హత్యకు గల కారణాలు విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
విజయవాడలో పాత నేరస్తుడి హత్య - vinchipeta murder news
కృష్ణా జిల్లాలో పాత నేరస్తుడు హత్యకు గురయ్యాడు. మృతుడు ఓ వ్యక్తితో గొడవ పడినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నామన్నారు.

rawdy sheeter murder in vijayawada