కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ పోలీసులు గూడవల్లి జాతీయ రహదారిపై చేపట్టిన వాహన తనిఖీల్లో భాగంగా మిని వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించారు. తణుకు వైపు తరలిస్తున్న నాలుగు టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు... వాహనాన్ని సీజ్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
4టన్నుల రేషన్ బియ్యం పట్టివేత - కృష్ణా జిల్లా తాజా వార్తలు
విజయవాడ నుంచి తణుకు వైపు మిని వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
రేషన్ బియ్యం పట్టివేత