ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి నుంచి నుంచి పట్టణాలు, నగరాల్లో ఇంటింటికీ రేషన్‌ బియ్యం: మంత్రి కొడాలి - రేషన్ బియ్యం పంపిణీ తాజా వార్తలు

నేటి నుంచి పట్టణాలు, నగరాల్లో ఇంటింటికీ రేషన్‌ బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఇది ప్రజా ప్రయోజన కార్యక్రమన్న మంత్రి...మొబైల్‌ వాహనాల ద్వారా బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

రేపట్నుంచి పట్టణాలు, నగరాల్లో ఇంటింటికీ రేషన్‌ బియ్యం
రేపట్నుంచి పట్టణాలు, నగరాల్లో ఇంటింటికీ రేషన్‌ బియ్యం

By

Published : Jan 31, 2021, 10:50 PM IST

Updated : Feb 1, 2021, 3:38 AM IST

రేషన్ బియ్యం పంపిణీ ప్రజా ప్రయోజన కార్యక్రమమని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. నేటి నుంచి పట్టణాలు, నగరాల్లో ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. మెుబైల్ వాహనాల ద్వారా బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

నిత్యావసరాల పంపిణీని విస్మరించటం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించిందన్నారు. పేదల ఆకలితీర్చే కార్యక్రమమన్న న్యాయస్థానం వ్యాఖ్యలు హర్షణీయమన్నారు. రాజకీయ నేతలెవరూ లేకుండానే అర్బన్‌ ప్రాంతాల్లో సోమవారం నుంచి బియ్యం పంపిణీ చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీపై ఎస్‌ఈసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని మంత్రి కొడాలి వెల్లడించారు.

Last Updated : Feb 1, 2021, 3:38 AM IST

ABOUT THE AUTHOR

...view details