తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడలోని పౌర సరఫరాల కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు ధర్నా చేపట్టారు. తమను అవమానించే విధంగా ప్రభుత్వం వ్వవహరిస్తోందని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు మందాడి వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. రావాల్సిన 8 విడతల బకాయిలు, కమిషన్లు చెల్లించాలని ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటీకి స్పందన లేదని వాపోయారు.
అవమానించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది: రేషన్ డీలర్లు
తమను అవమానించే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు మందాడి వెంకట్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని పౌర సరఫరాల కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు ధర్నా చేపట్టారు.
తమను అవమానించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది
ఇంటింటికి రేషన్ తీసుకెళ్లే వాహన డ్రైవర్లకు ఇచ్చే వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకించడం లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా గౌరవ వేతనం రూ. 18 వేలు ఇవ్వాలని అడుగుతున్నామని... రేషన్ దుకాణాల అద్దెలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. డీలర్ల కుటుంబాల భద్రతకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:రుణాన్ని చెల్లించలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం