ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్ల నిరసన - ration dealers protest in ap

విజయవాడ అశోక్ నగర్ లోని సివిల్ సప్లై కార్యాలయం ముందు రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. కరోనాతో మృతి చెందిన రేషన్ డీలర్లకు ఎక్సగ్రేషియా చెల్లించాలని కోరారు. ప్రభుత్వం తమకు గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ration dealers protest at vijayawada
రేషన్ డీలర్ల నిరసన

By

Published : Oct 23, 2020, 3:18 PM IST

నిత్యావసర సరకులు ప్రజలకు ఇచ్చేందుకు 6.7 వర్షన్ తో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ అశోక్ నగర్ లోని సివిల్ సప్లై కార్యాలయం ముందు రేషన్ డీలర్లు నిరసన చేపట్టారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామని.. కరోనాతో 30 మంది రేషన్ డీలర్లు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో మృతి చెందిన రేషన్ డీలర్లకు ఎక్సగ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు గౌరవ వేతనం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details