ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

74 ఏళ్ల మహిళకు అరుదైన గుండె ఆపరేషన్​ - హైదరాబాద్​ విరించి ఆస్పత్రి తాజా వార్తలు

ఓ 74 ఏళ్ల మహిళ గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చింది. గుర్తించిన వైద్యులు ఆధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి బృహద్ధమని కవాటానికి విజయవంతంగా ఆపరేషన్​ నిర్వహించారు. ఆమె ఇప్పుడు ఆరోగ్యంగా ఉందని హైదరాబాద్​ విరించి ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.

74 ఏళ్ల మహిళకు అరుదైన గుండె ఆపరేషన్​
74 ఏళ్ల మహిళకు అరుదైన గుండె ఆపరేషన్​

By

Published : Oct 29, 2020, 10:02 AM IST

సరికొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించి 74 ఏళ్ల మహిళ బృహద్ధమని కవాటానికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లు హైదరాబాద్​ విరించి ఆస్పత్రి ప్రకటించింది. రెండు నెలల క్రితం గుండె నొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఆ మహిళకు చికిత్సను అందించామని వైద్యులు పేర్కొన్నారు.

ఆమె అరోటిక్ వాల్వ్ స్టెనోసిస్​తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మహిళ గుండె ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని సరఫరా చేయటమే అరోటిక్ వాల్వ్ పని. ఆ పని దాదాపుగా మూసుకుపోవటం వల్ల వాల్వ్ మార్చాలని వైద్యులు భావించారు. మహిళ వయసు ఎక్కువగా ఉండటం కారణంగా అప్పటికే ఆమె రక్తనాళాలు గట్టిపడ్డాయి. దీంతో ఇటీవల అందుబాటులోకి వచ్చిన హైడ్రా అరోటిక్ వాల్వ్​ని మహిళకు అమర్చారు.

వాల్వ్ ఇంప్లాంట్ ద్వారా ఆమెకు గట్టిపడిన రక్త నాళాలనుంచి సులభంగా అమర్చేందుకు వీలు కల్గిందని వైద్యులు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు వస్తాయని వైద్యులు వెల్లడించారు. శస్త్రచికిత్సతో మహిళ వేగంగా కోలుకోవటం వల్ల ఇటీవల ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర ప్రకటించారు. శస్త్రచికిత్స విజయవంతమవటం పట్ల ఆస్పత్రి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

74 ఏళ్ల మహిళకు అరుదైన గుండె ఆపరేషన్​

ఇదీ చూడండి :కాలుష్య కాసారంగా దిల్లీ- మోగుతున్న ప్రమాద ఘంటికలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details