భారీ వర్షాల వల్ల రోడ్లు పాడయ్యాయని ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. రోడ్ల కోసం గతేడాది రూ. 220 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉందని...ఈ ఏడాది రూ. 932 కోట్ల వరకు పెంచాలని సీఎంను కోరినట్లు తెలిపారు. రహదారుల మరమ్మతు బిల్లులు నెలవారీగా బ్యాంకుల నుంచి నేరుగా చెల్లిస్తామని అన్నారు. రహదారుల వార్షిక నిర్వహణకు రూ. 160 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. విడతల వారీగా 40 వేల కి.మీ. మేర రోడ్ల మరమ్మతులు చేయాలన్న ఆయన.. 8,970 కి.మీ. రహదారుల నిర్వహణకు రూ. 2,205 కోట్ల రుణం తీసుకుంటున్నట్లు తెలిపారు.
రహదారుల వార్షిక నిర్వహణకు రూ. 160 కోట్లు కేటాయింపు: కృష్ణబాబు - RandB KrishnaBabu on Roads damage
రహదారుల వార్షిక నిర్వహణకు రూ. 160 కోట్లు కేటాయించినట్లు ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. భారీ వర్షాల వల్ల రోడ్లు పాడయ్యాయని.. విడతల వారీగా రోడ్ల మరమ్మతులు చేయనున్నట్లు తెలిపారు.
ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు