ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్న అంశానికి ప్రభుత్వం ఎలా నోటీసులు ఇస్తుందని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. చంద్రబాబు ఉంటున్న నివాసానికి నోటీసులు అంటించటం కక్ష సాధింపేనని ఆయన మండిపడ్డారు. వై.ఎస్ హయాంలో వీటికి ఎలా అనుమతులిచ్చారని రామానాయుడు ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి...కక్ష సాధింపు చర్యలు చేపట్టడం మంచిది కాదని ఆయన అన్నారు.
కోర్టులో ఉంటే నోటీసులు ఎలా ఇస్తారు? - టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు
చంద్రబాబు ఉంటున్న నివాసానికి నోటీసులు అంటించటం కక్ష సాధింపేనని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.
టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు
ఇవీ చదవండి...ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భద్రత మరింత కుదింపు