ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీవీఎల్​ రెండు నాల్కల ధోరణి సరికాదు -సీపీఐ నేత రామకృష్ణ - జీవీఎల్​ తీరుపై రామకృష్ణ ఆగ్రహం

Ramakrishna on GVL: జీవీఎల్​ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. అజెండా నుంచి హోదా అంశం తొలగించడంలో జీవీఎల్​ కీలక పాత్ర పోషించారని మండిపడ్డారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఈనెల 20న అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలతో సమావేశమవుతామని రామకృష్ణ స్పష్టం చేశారు.

cpi narayana
సీపీఐ నారాయణ

By

Published : Feb 15, 2022, 11:00 AM IST

Ramakrishna on GVL: ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కపట నాటకాలు కట్టిపెట్టాలని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. జీవీఎల్ రెండు నాల్కల ధోరణిని ఖండిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని వ్యాఖ్యానించిన జీవీఎల్.. ఇప్పుడేమో చర్చకు కమిటీ కోరుతూ కేంద్ర హోంశాఖ లేఖ రాశానంటున్నారని ఆరోపించారు. భాజపా ధ్వంద వైఖరికి ఇవే నిదర్శనాలని విమర్శించారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఈనెల 20న విజయవాడలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలతో సమావేశమవుతామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details