ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో మరో దారుణం.. పుట్టినరోజు వేడుకల్లో బాలికపై అత్యాచారం! - పుట్టినరోజు వేడుకల్లో బాలికపై అత్యాచారం

హైదరాబాద్​లో మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్​ పరిధిలో బాలికపై అత్యాచారం కేసులో ఓ యువకుడిని రామ్‌గోపాల్‌పేట్ పోలీసులు అరెస్టు చేశారు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లగా.. అక్కడ అత్యాచారం చేసినట్లు బాలిక ఫిర్యాదు చేసింది.

Girl raped at necklace road
Girl raped at necklace road

By

Published : Jun 6, 2022, 10:13 PM IST

Girl raped at necklace road: హైదరాబాద్​లో మరో దారుణ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. జూబ్లీహిల్స్ ఘటన మరవకముందే కారులో అత్యాచారం చేశాడని మరో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సురేశ్ అనే యువకుడిని రామ్​గోపాల్​పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్‌ 20న ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈనెల 4న బాలిక పోలీసులను ఆశ్రయించింది.

స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించి..: స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు సురేశ్ తనను ఆహ్వానించినట్లు బాలిక ఫిర్యాదులో పేర్కొంది. ఆ వేడుకల సమయంలో కారులోనే సురేశ్‌ అత్యాచారం చేశాడని బాలిక ఫిర్యాదులో వెల్లడించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సురేశ్‌ను రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అసలేలా జరిగిందంటే..:మల్లేపల్లి, విజయనగర్ కాలనీ ప్రాంతంలో జిరాక్స్ షాపులో పనిచేస్తుండే సురేశ్(23)కి హాస్టల్లో ఉంటూ కళాశాలకు వెళ్తున్న అనాథ బాలిక (17)తో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆమెతో తరచుగా బయట కలిసి మాట్లాడేవారని.. బాలికకు బహుమతిగా మొబైల్ కూడా ఇప్పించాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 20వతేదీన కళాశాలకు వెళ్తున్నానని హాస్టల్ వార్డెన్​కు చెప్పిన బాలిక.. మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి స్నేహితుని పుట్టినరోజు వేడుకలకు వెళ్తూ.. సురేశ్​ను కూడా తీసుకెళ్లారు.

జీరో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు..:అదే రోజు రాత్రి 12 గంటలకు నెక్లెస్ రోడ్డుకు చేరుకోగా కొంతసేపటికే స్నేహితులు పుట్టినరోజు వేడుకల్లో నిమగ్నమై ఉన్నారు. అదే అదునుగా భావించిన సురేశ్.. బాలికతో మాట్లాడేందుకు అని చెప్పి పక్కను తీసుకెళ్లి అక్కడున్న కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అనాథ కావడంతో గోల్కొండ ఐసీడీఎస్ సూపర్​వైజర్ హుమయూన్ నగర్ పోలీసులకు ఈనెల 4వతేదీన ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు రాంగోపాల్ పేట్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు సురేశ్​ను రిమాండుకు తరలించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details