ప్రజలు విజ్ఞత, విచక్షణతో ఓటు వేస్తే రాష్ట్రానికి మేలు చేసిన వారవుతారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో పారదర్శక పాలన అందిస్తూ, హెచ్చుతగ్గులు లేకుండా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. మేలైన ఆంధ్రప్రదేశ్, మెరుగైన భారతదేశం, పటిష్టమైన ప్రజాస్వామ్యం కోసం ఓటు వేయాలని కోరుతూ పారిశ్రామిక, వాణిజ్య, కార్మిక, రవాణా, ఆటోమొబైల్ సేవా సంఘం సభ్యులు ఆధ్వర్యంలో విజయవాడ ఆటోనగర్లో ర్యాలీ నిర్వహించారు. కృష్ణాజిల్లా ఎగ్జిబిషన్ సొసైటీ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కుటుంబరావు కోరారు.
ఇదీ చదవండి