విజయవాడ నగరంలో ఇవాళ రైతుబజార్లు తెరుచుకోలేదు. పలు ప్రాంతాల్లో కూరగాయలు కొనేందుకు వినియోగదారులు రాగా... మూసివేసి ఉండటం చూసి వెనుదిరిగారు. అధికారుల తీరుపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సమాచారం ఇవ్వకుండా మూసివేయడం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు రైతు బజార్లు తెరుచుకోకపోవటంతో విజయవాడలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై కూరగాయల స్టాల్స్ వెలిశాయి.
సమాచారం ఇవ్వకుండా రైతు బజార్లు మూసివేత - విజయవాడ రైతు బజార్లు
విజయవాడ నగరంలో ఇవాళ రైతు బజార్లు తెరుచుకోలేదు. కనీసం సమాచారం ఇవ్వకుండా మూసివేయటం ఏంటని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
vijayawada markets