ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రామ మందిర నిర్మాణ నిధుల సేకరణ.. కొనసాగిన శోభాయాత్ర - విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రామాలయం నిర్మాణానికి విరాళాలు తాజా వార్తలు

అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం విరాళాల సేకరణ ప్రక్రియ పలు ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్​, ఇతర హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో శోభాయాత్రలు నిర్వహిస్తూ.. విరాళాలు సేకరిస్తున్నారు.

Raising funds for the construction of Rama Mandir
రామ మందిర నిర్మాణ నిధుల సేకరణ

By

Published : Jan 17, 2021, 1:06 PM IST

రామజన్మభూమి అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం విరాళాల సేకరణ ప్రక్రియను విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్​తో పాటుగా ఇతర హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో చేపట్టారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

ధార్మిక సంస్థల నిర్వాహకులు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. రామజన్మ భూమి విశిష్టతను, ఆలయ నిర్మాణ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేశారు. తమకు తోచిన విరాళాలను ఆలయ నిర్మాణం కోసం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

హిందూపురంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో..

అయోధ్య రామమందిర నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగాలని సంకల్పిస్తూ... అనంతపురం జిల్లా హిందూపురంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని పాండురంగ నగర్ పురవీధుల్లో శ్రీ సీతా రామ లక్ష్మణ ఆంజనేయ ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగించారు. శ్రీ రామ సంకీర్తనలతో భజన చేస్తూ నగరమంతా తిరిగారు. వీధుల్లో రాముని భక్తులు ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహించారు.

ఇవీ చూడండి:

తిరుగు ప్రయాణమయ్యే వారికి... ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details