శ్రీలంకను ఆనుకుని కామోరిన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతున్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియచేసింది. రాగల 48 గంటల్లో ఇది క్రమంగా ఆరేబియా సముద్రంపై ఆవరించే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు. ఇది క్రమంగా బలపడి మరింత ప్రభావం చూపించే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలియచేసింది. అల్పపీడన ప్రాంతాన్ని ఆనుకుని మరో ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది.
weather report: అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తాలో వర్షాలు: వాతావరణ శాఖ - rains latest updates
శ్రీలంకను ఆనుకోని కామోరిన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాజిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ జిల్లాలోనూ చాలా చోట్ల తేలికపాటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తాలో వర్షాలు
దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ చాలా చోట్ల తేలికపాటి నుంచి విస్తారంగానే వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.
ఇదీ చదవండి: