ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో పలుచోట్ల చిరు జల్లులు

భాగ్యనగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. రోడ్లపై వాన నీరు నిలిచి.. రాకపోకలకు అంతరాయం కలిగింది.

rains in many areas of hyderabad city
హైదరాబాద్​లో పలు చోట్ల చిరు జల్లులు..

By

Published : Apr 20, 2021, 9:31 PM IST

హైదరాబాద్​లో పలు చోట్ల చిరు జల్లులు..

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు కురిశాయి. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, నాంపల్లి, ఎర్రగడ్డ, సనత్‌నగర్, పంజాగుట్ట, చింతల్ బస్తీ ప్రాంతాల్లో వాన పడింది.

ముషీరాబాద్, రాంనగర్, కవాడిగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్​రోడ్, విద్యానగర్, గాంధీనగర్, హయత్​నగర్​ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచి.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా వాహనదారులు, పాదచారులు అవస్థలు పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details