ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గాలివాన బీభత్సం.. గుంటూరులో పిడుగుపాటుకు వ్యక్తి మృతి - ఆంధ్రప్రదేశ్​లో వర్షాలు న్యూస్

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. గుంటూరులో ఓ వ్యక్తి పిడుగుపాటుకు మృతి చెందాడు.

రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం

By

Published : May 13, 2021, 5:32 PM IST

కృష్ణా, గుంటూరు, కడప జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు పడుతున్నాయి. గాలివానతో మామిడి రైతులు తల్లడిల్లిపోతున్నారు. గాలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. మామిడి నేలరాలిపోతోంది. కృష్ణా జిల్లాలోని గన్నవరం, ఉంగుటూరు, విజయవాడ గ్రామీణ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. చెట్లు కూలిపోయాయి. నాదెండ్ల మండలం అప్పాపురంలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందాడు. కడప జిల్లా వీరబల్లి, రామాపురం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. 500 ఎకరాల్లో మామిడి నేలరాలి.. చెట్లు కూలిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details